చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Chandrababu: మ.2.15 గంటలకు ప్రారంభం కానున్న వాదనలు

Update: 2023-10-03 03:56 GMT

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Chandrababu: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ జరగనుంది. తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్పించనున్నారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. ఇక అమరావతి రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆర్కే ఆరోపించారు.

ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదుతో 2022 మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. అయితే చంద్రబాబును ఏ-1 నిందితుడిగా పేర్కొంది. అలాగే మాజీమంత్రి నారాయణ, లింగమనేని తోపాటు పలువురుని సీఐడీ నిందితులుగా పేర్కొంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సైతం సీఐడీ మెమోలో ఏ-14గా పేర్కొంది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News