గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన శ్రీనివాస్ విడుదల
Andhra News: రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన న్యాయమూర్తి
గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన శ్రీనివాస్ విడుదల
Andhra News: గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన ఉయ్యూరు శ్రీనివాస్‌కు ఊరట లభించింది. శ్రీనివాస్‌కు రిమాండ్ విధించాలన్న పోలీసు రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి మినహాయింపు లభించింది. అనంతరం 25 వేల రూపాయల స్వయం పూచీకత్తుపై శ్రీనివాస్ విడుదలయ్యారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న NRI ఉయ్యూరు శ్రీనివాస్‌పై కావాలనే వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు.