Abdul Nazeer: మాది పేదల పక్షపాత ప్రభుత్వం
Abdul Nazeer: ఇచ్చిన హామీలను అమలు చేయడానికి త్రికరణ శుద్ధితో పనిచేశాం
Abdul Nazeer: మాది పేదల పక్షపాత ప్రభుత్వం
Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు గవర్నర్. సాంఘిక, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు గవర్నర్. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఏపీలో మానవాభివృద్ధి సూచికలు పెంచేందుకు నతరత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు గవర్నర్. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామన్నారు.