YouTuber: యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి ఫైర్‌.. సమాజమే మార్పు తేవాలి

యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి నరసింహారావు పరోక్ష స్పందన. నేరస్థుడికి శిక్ష కంటే సమాజం తిరస్కరించడమే మార్పు తెస్తుందని వ్యాఖ్యలు.

Update: 2026-01-02 12:18 GMT

YouTuber: యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి ఫైర్‌.. సమాజమే మార్పు తేవాలి

ప్రముఖ ప్రవచన కర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో అన్వేష్ ఫాలోవర్స్ భారీగా తగ్గారు. పరిస్థితి చేయి దాటడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

ఈ నేపథ్యంలో తాజాగా గరికపాటి నరసింహారావు పాల్గొన్న ఓ ప్రవచన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా, గరికపాటి పరోక్షంగా స్పందించినట్లు పలువురు భావిస్తున్నారు. నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఇచ్చే తిరస్కారమే అతడిలో మార్పు తీసుకువస్తుందని గరికపాటి వ్యాఖ్యానించారు.

“ఒక వ్యక్తికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు. కానీ సమాజం మొత్తం అతడిని ఈసడించుకుంటే తప్పకుండా మారతాడు. తప్పు చేసినవారిని తప్పు చేశావని ముఖం మీదే చెప్పగలగాలి. లేకపోతే నిర్దోషులపై బురద జల్లే పరిస్థితులు పెరుగుతాయి” అని ఆయన అన్నారు.

అలాగే తన విషయంలో అభిమానులు ఎప్పుడూ సహించలేదని, ధర్మం వైపు నిలబడి సోషల్ మీడియాలోనూ సమర్థవంతంగా స్పందించారని గరికపాటి పేర్కొన్నారు. “ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే స్పందించాల్సిందే. ధర్మానికి నిలబడే శక్తి సమాజంలో ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.


Full View


Tags:    

Similar News