Chirala: మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు

యువతకు ఉపాధి కలిపిస్తాంమంటూ అందులో భాగంగా వివిధ కంపినీలకు చెందిన గ్యాస్ ఏజన్సీలను ఇప్పిస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ను వేదిక చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు.

Update: 2020-03-11 07:10 GMT

చీరాల: యువతకు ఉపాధి కలిపిస్తాంమంటూ అందులో భాగంగా వివిధ కంపినీలకు చెందిన గ్యాస్ ఏజన్సీలను ఇప్పిస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ను వేదిక చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు. ఈ సందర్భంగా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి నిందితుల తాలూకా వివరాలను వెల్లడించారు.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆన్ లైన్ లో ఉన్న గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోగా ,ఆ ఫోన్ నెంబర్ ద్వారా దరఖాస్తు దారుడి నుంచి వివిధ బ్యాంకు అకౌంట్లలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల మేర కట్టించుకున్నారు. తీరా ఎంతకీ సరైన స్పందన లేకపోవడంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బ్యాంకు అకౌంట్ల ఆధారంగా కోల్ కతా కు చెందిన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు .ఇదే ముఠాకు చెందిన మరికొందరిని అరెస్ట చేయాల్సి ఉందని తెలిపేరు .నిందితులను మెజిస్టేట్ ముందు హాజరుపరుస్తునట్లు పోలీసులు తెలిపేరు .


Tags:    

Similar News