పెద్దాపురంలో ఉచిత వైద్య శిబిరం

చొప్పదండి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో పెద్దాపురం గ్రామంలోని గ్రామ పంచాయితీలో విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ ఎన్.ఎల్ రెడ్డి వారి సౌజన్యంతో పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Update: 2020-02-01 07:22 GMT

చొప్పదండి: చొప్పదండి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో పెద్దాపురం గ్రామంలోని గ్రామ పంచాయితీలో సూర్య పిల్లల హాస్పిటల్ కరీంనగర్ వారిచే, విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ ఎన్.ఎల్ రెడ్డి వారి సౌజన్యంతో పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 60 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ‌ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల జ్యోతిబసు, లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి అధ్యక్షులు తొడుపునూరి లక్ష్మయ్య, కార్యదర్శి కొల్లూరి జితేందర్, సభ్యులు రాజేష్ పవార్, సామల వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి పున్నయ్య, వార్డు సభ్యులు అశోక్ గౌడ్, సిపల్లి అంజయ్య, ఏఎన్ఎం రూపిని, అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News