YS Jagan: పిఠాపురంలో మాజీ సీఎం జగన్ పర్యటన
YS Jagan: పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ
YS Jagan: పిఠాపురంలో మాజీ సీఎం జగన్ పర్యటన
YS Jagan: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రమణక్కపేట, పాత ఇసుకపల్లి, నాగులపల్లి, యు.కొత్తపల్లి ప్రాంతాల్లో వరదల కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుల్ని పరామర్శించారు జగన్. రైతులు నీట మునిగిన వరి నాట్లను జగన్‌కు చూపిస్తూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేసిన మహిళలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.