భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి మృతి
Kunja Satyavathi: బీపీ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి మృతి
Kunja Satyavathi: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి బీపీ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ చనిపోయారు. కుంజ సత్యవతి 2009 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. 2017లో బీజేపీలో జాయిన్ అయి 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న సత్యవతి ఆకస్మిక మృతితో కార్యకర్తల్లో విషాదంలో మునిగిపోయారు.