పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
Palnadu: ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 94 మంది విద్యార్థులు
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 94 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. ఘటనపై సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చిన సమయంలో RDO రాజాకుమారి అక్కడే ఉన్నారు. దీంతో RDO రాజాకుమారిని తల్లిదండ్రులు నిలదీశారు.