విదేశీ ప్రయాణికులతో గన్నవరానికి రానున్న ప్రత్యేక విమానాలు

Update: 2020-05-19 11:20 GMT

కరోనా నేపధ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన మన దేశానికి చెందిన వారిని తిరిగి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడకు కొన్ని విమానాలు రానున్నాయి. వాటి వివరాలు..

సౌదీ అరేబియా నుంచి 20న రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ప్రయాణికులతో గన్నవరం ఎయిర్పోర్ట్‌కు రానున్న ప్రత్యక విమానం. సౌదీ అరేబియా నుంచి ఈ నెల 23న రాత్రి 10 గంటలకు గన్నవరం చేరుకోనున్న మరో ఎయిరిండియా విమానం. వివిధ దేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రవాసాంధ్రులను తీసుకొని ఈ నెల 27న ఉదయం 11:30కు గన్నవరం విమనాశ్రయానికి రానున్న మరో ఎయిరిండియా విమానం

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్ట్‌లోని అంతర్జాతీయ టెర్మినల్‌ను సిద్ధం చేసిన అధికారులు. ప్రయాణీకులు దిగిన వెంటనే వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులు ఎంపిక చేసుకున్న పెయిడ్ క్వారెంటైన్‌కు తరలింపు.

Tags:    

Similar News