Grama Panchayathi: ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన.. గ్రామాల్లో కొలువుదీరనున్న ప్రత్యేక అధికారులు!
Grama Panchayathi: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన సర్పంచుల పదవీకాలం. గ్రామ పంచాయతీల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం.
Grama Panchayathi: ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన.. గ్రామాల్లో కొలువుదీరనున్న ప్రత్యేక అధికారులు!
Grama Panchayathi: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల ఐదేళ్ల పాలన కాలం నేటితో అధికారికంగా ముగిసింది. 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయ్యింది. రాష్ర్ట ప్రభుత్వం పంచాయతీల నిర్వాహణ కోసం కీలకం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికలు జరిగి, పాలక వర్గాలు కొలువు దీరే వరకు గ్రామాల్లో పాలన కుంటుపడకుండా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. రేపు ఉదయం నుంచి గ్రామ పంచాయతీలకు తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈఓ, ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సర్పంచులు రికార్జులను, చెక్ పవర్ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత అధికారులకు అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలకు అధికారులను కేటాయిస్తూ ఇప్పటికే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. నిధులు విత్ డ్రా, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర విధులను ప్రత్యేక అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.