ఐదేళ్ళ వయుస్సులోనే గుర్రపు స్వారీలో ఆరితేరిన జోషిత్ ఛత్రపతి

Anakapalle: చిన్నప్పటి నుంచి మగధీర సినిమా అంటే బాలుడికి ఇష్టం

Update: 2022-05-09 02:30 GMT

ఐదేళ్ళ వయుస్సులోనే గుర్రపు స్వారీలో ఆరితేరిన జోషిత్ ఛత్రపతి

Anakapalle: పిట్ట కొంచెం, కూత ఘనం సామెతకు సరిగ్గా సరిపోతాడు ఈ బుడ్డోడు. ఏమీ తెలియని వయసులో ఏదో ఒక స్పెషాలిటీ చూపిస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తమకున్న టాలెంట్ తో పసివయస్సులోనే అద్భుతాలు చేస్తుంటారు. ఒకరు లెక్కల్లో తొక్క తీస్తారు. మరికొందరు పరీక్షల్లో వాట్ ఏ టాలెంట్ అనిపించేలా చేస్తారు. మరికొందరు ఆటల్లో అదరగొడతారు. ఇంకొందరైతే పాటలు, డ్యాన్సులు ఇరగదీస్తారు. ఇలా ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఇక తిమ్మాపురం గ్రామానికి చెందిన చిచ్చరపిడుగు చిన్న వయసులోనే అద్భుత సాహసం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. స్కూల్ కు వెళ్లి, పెన్ను, పుస్తకం పట్టుకోక ముందే.. గుర్రపు నాడా పట్టుకున్నాడు. చల్‌చల్‌ అంటూ గుర్రాన్ని పరుగులు పెట్టేస్తున్నాడు. ఐదేళ్ళ వయుస్సులోనే గుర్రపు స్వారీలో ఆరి తేరాడు. గుర్రంపై సూపర్ హీరోలా కేక పుట్టిస్తున్నాడు.

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన చెవ్వేటీ నాగేంద్రసాయి తేజస్వినీల కొడుకే చెవ్వేటి జోషిత్ ఛత్రపతి. నాగేంద్ర విద్యార్ధులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో తర్ఫీదు ఇచ్చే శ్రీవేద డిఫెన్స్ అకాడమీ ఇన్‌స్టిట్యూట్‌ ను నడుపుతున్నారు. అయితే చిన్నప్పటి నుంచి జోషిత్ కు మగధీర సినిమా పెడితే తప్పా అన్నం తినేవాడుకాదని, నిద్రపోతున్నా, ఆడుకుంటున్నా, తింటున్నా ఎప్పుడైనాసరే మగధీర సినిమా చూసేవాడని తండ్రి నాగేంద్ర సాయి అంటున్నారు. 3 సంవత్సరాలు నుండి జోషిత్ గుర్రం తోలుతున్నాడని, ధైర్యం ఎక్కువని తాత చెబుతున్నాడు. ఆటలతో పాటు చదువులో కూడా జోషిత్ ఆశక్తి ఎక్కువని తల్లి తేజస్వని అంటున్నారు.

Tags:    

Similar News