Nallamala Forest: నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు

Nallamala Forest: గుండం ప్రాంతాలలో మరోసారి అగ్ని జ్వాలలు

Update: 2024-04-07 07:45 GMT

Nallamala Forest: నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు

Nallamala Forest: నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మరోసారి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అమ్రమాబాద్ మండలం తాళ్ల చేలుక, గుండం ప్రాంతంలో అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలతో అటవిలో భారీ ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎవరూ మంటలు వేయరాదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. మంటలు వేసిన వారిపై శాఖపరమైన అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News