నెల్లూరు జిల్లాలో టపాకాయల గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురుకి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Fire Accident: చేజర్ల మండలం మాముడూరులో ఘటన

Update: 2023-05-28 08:00 GMT

నెల్లూరు జిల్లాలో టపాకాయల గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురుకి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Fire Accident: నెల్లూరు జిల్లాలో బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చేజర్ల మండలం మాముడూరు గ్రామ సరుగుడు తోటల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచాకు వినియోగించే నల్లమందు తయారీలో ఒక్కసారి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు రోజువారి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురిని ఆత్మకూరు, మరో ముగ్గురిని నెల్లూరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన బాణసంచా తయారీకి ఎలాంటి లైసెన్సులు లేవని సమాచారం. లైసెన్స్ లేని టపాసుల తయారీ అంతా స్థానిక నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామ సమీపంలోని సరుగుడు తోటలో అనధికార టపాసుల తయారీ కేంద్రం నడుస్తోంది. అయితే ఈ ప్రమాదాన్ని సరుగుడు తోటలో అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News