JD Lakshmi Narayana: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయం చేస్తున్నా
JD Lakshmi Narayana: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయం చేస్తున్నా
JD Lakshmi Narayana: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాను ఎటువంటి రాజకీయ పార్టీలో చేరనని, ప్రస్తుతం ప్రజలను చైతన్య పరచడమే తన పనంటూ చెప్పుకొచ్చారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తిరిగి కోలుకోవాలంటే ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు కల్పించాలన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం స్వయంగా వ్యవసాయం చేస్తున్నానని, వ్యవసాయం పట్ల యువత మక్కువ పెంచుకోవాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.