అభివృద్ధికి సమానత్వానికి ఆంగ్ల భాష మార్గం

అభివృద్ధికి సమానత్వానికి మార్గమని ఆంగ్ల భాష మార్గమని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర పేర్కొన్నారు

Update: 2019-12-02 05:37 GMT
టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర పేర్కొన్నారు

రాయచోటి: అభివృద్ధికి సమానత్వానికి మార్గమని ఆంగ్ల భాష మార్గమని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం అభినందనీయమన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం తెలుగు భాషకు ముప్పు లేదన్నారు.

ఆంగ్లంతో నైపుణ్యం పమెరుగుపరచకోవచ్చని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం చదవనీవ్వకుండా కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఆపాలని చూడటం సమంజసం కాదన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆంగ్ల భాష అత్యంత అవసరమన్నారు. ఆంగ్లం తప్పకుండా అభ్యసించాలన్నారు. ఆంగ్లం నేర్చుకుంటే భాషపై పట్టు పెంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News