ఏనుగుల గుంపు బీభత్సం.. రైతుపై దాడి.. పంటలు ధ్వంసం

Elephants: నెల రోజులుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

Update: 2024-02-14 09:37 GMT

ఏనుగుల గుంపు బీభత్సం.. రైతుపై దాడి.. పంటలు ధ్వంసం

Elephants: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున పంట పొలాల్లోకి గజరాజులు ప్రవేశించాయి. ఏనుగులను అడవిలోకి తరిమే క్రమంలో ఓ రైతు గాయపడ్డాడు. ఏనుగుల దాడిలో రైతు మనోహర్ రెడ్డి కుడి చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే నెల రోజులుగా ఏనుగులు గుంపు సంచరిస్తుందని రైతులు భయాందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News