Earthquake: విశాఖ జిల్లాలో భూప్రకంపనలు
విశాఖ జిల్లాలో భూప్రకంపనలు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో కంపించిన భూమి భూకంప తీవ్రత 3.7గా నమోదు
Earthquake: విశాఖ జిల్లాలో భూప్రకంపనలు
విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఆరిలోవ, సింహాచలం, హెచ్‌బీ కాలనీ, పేద వాల్తేరు, మధురవాడ, భీమిలి, బీచ్ రోడ్‌తో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల సమయంలో భూమి కంపించింది. 4 సెకండ్ల పాటు వచ్చిన భూకంపానికి విశాఖ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 3.7గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.