ఆంధ్రప్రదేశ్ లో విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణికులతో కళకళలాడుతున్నా ఎయిర్‌పోర్టులు

ఏపీలో మంగళవారం ఉదయం నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

Update: 2020-05-26 03:42 GMT

ఏపీలో మంగళవారం ఉదయం నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. నాలుగో దశ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఏపీలోని గన్నవరం, తిరుపతి, విశాఖ నుంచి దాదాపు రెండు నెలల తర్వాత విమానాలు ఎగురుతున్నాయి. అన్ని విమానాశ్రయల వద్ద థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు, శానిటైజర్లు వంటి చర్యలు చేపట్టారు.

విమానం ఎక్కాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత ఎయిర్‌లైన్స్‌ టికెట్లను బుక్ చేసుకోవాలని, అనుమతి తీసుకోకుంటే టికెట్లు జారీ చేయవద్దని ఏపీ ప్రభుత్వం సూచన చేసింది.

కేంద్రం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. చెన్నై, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి రాష్టంలోకి వచ్చేవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని చెప్పారు. రాష్ట్రంలోకి వచ్చిన వారందరికి స్క్రీనింగ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News