మాస్కులు అడిగితే పిచ్చోడంటారా?నర్సీపట్నం ఎమ్మెల్యేనే ఇలా చేస్తున్నారు.. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి
ఓ నక్సలైట్‌కు కూడా ఇలాంటి చికిత్స అందించరని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ నక్సలైట్‌కు కూడా ఇలాంటి చికిత్స అందించరని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఆసపత్రిలో తన కుమారుడు సుధాకర్ కు అందిస్తున్న వైద్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ డాక్టర్‌ను పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదటమేంటని? అసలు ఇది ప్రభుత్వమేనా? అని ప్రశ్నించారు. కేజీహెచ్‌కు తరలించి రెండు గంటల్లోనే తన కుమారుడు మతిస్థిమితం లేదని ఎలా నిర్ధారించారని, మాస్కులు అడిగితే పిచ్చోడని ముద్ర వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
నర్సీపట్నం ఎమ్మెల్యే కావాలనే ఇలా చేస్తున్నారని కవేరీబాయి ఆరోపించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని అన్నారు. దళితులను అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను వేరే ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. తమపై ప్రయోగాలు చేయవద్దని సీఎం జగన్‌ను కావేరీబాయి వేడుకున్నారు. సుధాకర్‌పై దాడిచేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు పెట్టాలని సుధాకర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సుధాకర్ కేసును వాదిస్తున్నందుకే లాయర్ శ్రావణ్‌కుమార్‌పై కేసు పెట్టారని కావేరేబాయి ఆరోపించారు