Andhra Pradesh: అమ్మబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కృష్ణ దాస్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ గురువారం ప్రారంభించారు.

Update: 2020-01-09 09:15 GMT

కశింకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ గురువారం ప్రారంభించారు. కశింకోట గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ఆరు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిది అన్నారు.

వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాల హామీలను ఒక్కొక్కటి ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బీ.వీ.సత్యవతి, పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, కశింకోట వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ల బుల్లి బాబు, అనకాపల్లి పట్టణ అధ్యక్షులు జానకి రామ రాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొర్లి సూరిబాబు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News