ఆ ఘటన కలచివేసింది.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులోని ఓ కళాశాలలో మైనర్ బాలిక చేత స్పాట్ వ్యాల్యూషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు.

Update: 2020-05-18 13:26 GMT
DGP Gautam Sawang(File photo)

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులోని ఓ కళాశాలలో మైనర్ బాలిక చేత స్పాట్ వ్యాల్యూషన్ గదిని శుభ్రం చేయించిన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు.గది శుభ్రం చేసే సమయంలో పోలీసు హెడ్‌ కానిస్టేబుళ్లు వీక్షకుల పాత్ర పోషించడంపై డీజీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు.

ఈ ఘటన తన హృదయాన్ని కలచి వేసిందని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన ఆరేళ్ల కూతురుతో పని చేయించడం బాధాకరమని డీజీపీ అన్నారు. పసిపిల్లలతో పని చేయించిన ఆమె తన్ద్రికి చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం నిషేధమన్నారు.  

Tags:    

Similar News