Ram Mohan Naidu: ఏవియేషన్ చట్టాల్లో సవరణలు.. వారిపై కఠిన చర్యలు
Ram Mohan Naidu: విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
Ram Mohan Naidu: ఏవియేషన్ చట్టాల్లో సవరణలు.. వారిపై కఠిన చర్యలు
Ram Mohan Naidu: విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గతంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్తే.. మరసటి రోజు ఉదయం మళ్లి తిరిగి వచ్చేవాళ్లమని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని. ఉదయం వెళ్లి.. సాయంత్రం తిరిగి రావొచ్చన్నారు. దీంతో విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఏవియేషన్‌కు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై లోతైన దర్యాప్తు జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టామని... నివేదిక వచ్చిన తర్వాత ఈ ఫేక్ థ్రెట్ కాల్స్ వెనుక బాధ్యులు, వారి ఉద్దేశాలు వెలుగు చూస్తాయన్నారు. ఫేక్ కాల్స్ బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని ఆదేశించారన్నారు. సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కి సంబంధించి రెండు కీలక చట్టసవరణ చేసి మరింత కఠిన వైఖరి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.