Indrakeeladri: శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Update: 2023-10-19 04:50 GMT

Indrakeeladri: శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు నేడు శ్రీమహాచండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించింది.

శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్టే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి.. శత్రువులు కూడా మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తారో అవి సత్వరమే నెరవేరతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Tags:    

Similar News