త్రిపురాంతకం: మండలంలోని కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై గుట్ల ఉమ్మడివరంచెక్ పోస్ట్ వద్ద, సుమారు 2500మంది వలస కూలీలు వారి గ్రామాలకు పోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గుంటూరు జిల్లా నుండి వచ్చారు. వీరంతా కర్నూలు జిల్లా ప్రజలు, మిర్చికోతలకు రెండు నెలల క్రితం వచ్చారు. ఉన్నతాదికారుల ఆదేశాలు వస్తేనే పంపిస్తామని, యర్రగొండపాలెం సి ఐ మారుతీకృష్ణ అంటున్నారు. వృద్ధులు, పిల్లలు, యువకులకు మంచినీళ్ళు లేక ఆకలి కేకలతో తల్లడిల్లి పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.