Cyclone Montha: ఒక్కో కుటుంబానికి రూ.3వేల సాయం: చంద్రబాబు
Cyclone Montha: రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు.
Cyclone Montha: ఒక్కో కుటుంబానికి రూ.3వేల సాయం: చంద్రబాబు
Cyclone Montha: రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు వివరాలు:
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి.
పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.3,000/- (మూడు వేల రూపాయలు) చొప్పున పంపిణీ చేయాలి.
ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలి.
అన్ని పునరావాస కేంద్రాలలో వెంటనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి.
జిల్లాలలో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ చర్యల ద్వారా తుపాను సమయంలోనూ, ఆ తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.