Cyclone Montha: ఆంధ్రతీరం దిశగా దూసుకు వస్తున్న మొంథా సైక్లోన్
Cyclone Montha: మొంథా తుఫాను ఆంధ్రతీరం దిశగా దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణాం చెందే అవకాశం ఉంది.
Cyclone Montha: ఆంధ్రతీరం దిశగా దూసుకు వస్తున్న మొంథా సైక్లోన్
Cyclone Montha: మొంథా తుఫాను ఆంధ్రతీరం దిశగా దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణాం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా కదలడం మొదలైంది. విశాఖకు 790 కిలో మీటర్లు కాకినాడకు 729 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. గంటకు 16 కిలో మీటర్ల వేగంతో మొంథా సైక్లోన్ కదులుతుంది. మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. మొంథా తుఫాను తీవ్ర తుపానుగా మారిన సమయంలో గటంకు 90 నుంచి వంద కిలో మీటర్లు, గరిష్టంగా 110 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరింది. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని..ఈ సమయంలో పెనుగాలులు, అథ్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
మొంథా తుఫాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాలకు వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాఠశాలలకు మరో రెండు రోజులు సెలవులు ప్రకటించారు అధికారులు, మత్య్యకారులకు వారం రోడుల పాటు చేపల వేట నిషేధించారు. సముద్రంలో అలజడి..అలల ఉదృతి..గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. సముద్రంలో 62 మేకేనైజ్డ్ బోట్లు సిద్ధంగా ఉంచారు. తీర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు బీచ్ లు మూసివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మొహరించాయి. అన్ని జిల్లాల కలక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలోనూ మొంథా తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచిస్తుంది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిపాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఇప్పటికే ఎల్లే అలర్ట్ జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్, ఆరంజ్ అలర్ట్ లు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరో వైపు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటకప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సమాచార వ్యవస్థలు సిద్ధం చేయాలని సూచించారు.