Cyclone Montha: మొంథా తుపాను ఎఫెక్ట్‌.. 43 రైళ్లు రద్దు

Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా మారడంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే (ECoR) అప్రమత్తమైంది.

Update: 2025-10-27 09:43 GMT

Cyclone Montha: మొంథా తుపాను ఎఫెక్ట్‌.. 43 రైళ్లు రద్దు

Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా మారడంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే (ECoR) అప్రమత్తమైంది. తుపాను ముప్పు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో నడవాల్సిన మొత్తం 43 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

తుపాను తీరం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో, ఈ మూడు రోజుల పాటు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్ల రాకపోకలపై ఈ ప్రభావం పడనుంది. రద్దయిన 43 రైళ్ల పూర్తి జాబితాను ఈస్ట్ కోస్ట్ రైల్వే తన అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

రైల్వే అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ, తాజా ప్రయాణ వివరాల కోసం ప్రయాణానికి ముందు తమ రైలు స్టేటస్‌ను తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించారు.



 



Tags:    

Similar News