Cyclone Ditwa: పూర్తిగా బలహీనపడిన దిత్వా తుఫాన్

Cyclone Ditwa: దిత్వా తుఫాన్ బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మిదిగా ఉత్తరం వైపు పయనిస్తుంది.

Update: 2025-12-02 06:00 GMT

Cyclone Ditwa: పూర్తిగా బలహీనపడిన దిత్వా తుఫాన్

Cyclone Ditwa: దిత్వా తుఫాన్ బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మిదిగా ఉత్తరం వైపు పయనిస్తుంది. గంటకు ఐదారు కిలో మీటర్ల వేగంతో తమిళనాడు, పుదుచ్చేరికి అతి సమీపంలో పయనిస్తూ చెన్నైకి చేరువగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కిలో మీటర్లు, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 170 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతుంది. మరో రెండు రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా.. సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవాళ రేపు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల , ఉత్తర కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్శషాలు, కోనసీమ , పశ్చిమ గోదావరి , నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు, అప్పుడప్పుడు 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో మూడో నెంబర్, మిగిలిన రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు.

Tags:    

Similar News