మతతత్వ పోకడలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవ్వాలి: సీపీఐ రామకృష్ణ

దేశంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సీపీఐ నిర్మాణంపై కేంద్రీకరించి సన్నద్ధమవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు.

Update: 2020-02-16 02:05 GMT

రాజమహేంద్రవరం: దేశంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సీపీఐ నిర్మాణంపై కేంద్రీకరించి సన్నద్ధమవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతనజిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో అవినీతి, లంచగొండితనం, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, విదేశాలకు తరలిపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానని వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఈ అయిదేళ్ళ ఎనిమిది నెలల్లో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయారని అన్నారు.

కార్పొరేట్ శక్తు లకు పూర్తిగా దేశ సంపదను ధారాదత్తం చేస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారత దేశంలో హిందూత్వ ఎజెండా అమలు చేయడం ద్వారా ముస్లింలు,మైనార్టీలలో అభద్రతా భావాన్ని పెంచుతున్నారని, దేశ ప్రజల మధ్య విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటును పూడ్చలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చలేదని, 25 మంది ఎంపీలను తనకిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మెడ వంచి బిజెపితో లాలూచీ అయ్యారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News