Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి..

Update: 2020-05-25 06:13 GMT
Representational Image

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ) అన్ని జిల్లాల్లో 10,240 సాంపిల్స్ ని పరీక్షించగా.. 44 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే 41 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసులకు గాను 1848 మంది కోలుకోవడంతో వివిధ జిల్లాలోని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.. అలాగే 56 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు 769గా ఉన్నాయి.

Tags:    

Similar News