ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి

Update: 2020-05-22 06:17 GMT

ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గత 24 గంటల్లో గురువారం ఉదయం 9 గంటల నుండి ఇవాళ ఉదయం 9 గంటల వరకూ.. 8,415 సాంపిల్స్ ని పరీక్షించగా 62 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారంతా క్వారంటైన్ లో ఉన్నవారుగా తెలుస్తోంది.

మరోవైపు 51 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ వ్యాధి వల్ల తాజాగా కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 728 గా ఉంది.

Tags:    

Similar News