ఏపీలో తగ్గని కరోనా.. ఇవాళ మరో 73 పాజిటివ్ కేసులు

ఏపీ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది.

Update: 2020-04-29 05:43 GMT
Representational Image

ఏపీ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కి చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల వరకు 7727 మంది పరీక్షలు నిర్వహించారు. ఇవాళ కర్నూలు లో 11, గుంటూరు 29, కృష్ణా 13, కడప 4, ప్రకాశం 4, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 2, విశాఖ జిల్లాలో 1, తూర్పు గోదావరి 1, చిత్తూరు 3, చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 287 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు. గత నాలుగు రోజులుగా ఒకరు కూడా మరణించలేదు. ప్రస్తుతం 1014 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కేసులు, గుంటూరు 283, కృష్ణా జిల్లాలో 236 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం 23, అనంతపురం 58, చిత్తూరు 77, నెల్లూరు 82, కడప 69, ప్రకాశం 60, తూర్పుగోదావరి 40, పశ్చిమగోదావరి 56, శ్రీకాకుళం 5, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.



Tags:    

Similar News