Vijayawada: ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం; అరసవెల్లిలో దర్శనాలు రద్దు
Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది
విజయవాడ కనకదుర్గ ఆలయం (ఫైల్ ఫొటో)
Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేగింది. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దుర్గగుడి అర్చకుల్లో ఐదుగురు కరోనా బారిన పడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారితో పాటు మరో 20 మంది బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లారు.
అరసవెల్లి ఆలయంలో దర్శనాలు బంద్
ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. నేటి నుంచి అరసవెల్లి ఆలయంలో భక్తుల దర్శనాలు రద్దు చేశారు అధికారులు. దీంతో మే 10వ తేదీ వరకు నిత్య కైంకర్యాలు ఏకాంతంగా జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు.