ఆ ఎనిమిది కార్పొరేషన్లు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయి : తులసిరెడ్డి

ఏపీ ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు

Update: 2020-05-22 07:48 GMT
Tulasi reddy(File photo)

ఏపీ ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు.. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లెలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 12 ను తప్పుబట్టారు.. ఈ జీవో లక్ష్యం.. వాహన మిత్ర పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల నుంచి నిధులు మళ్లించడం అని ఆరోపించారు. వైకాపా మ్యానిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి భగవద్గీతని పదే పదే చెప్తూ ఉంటాడన్న తులసిరెడ్డి.. వాహన మిత్ర పథకానికి బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి అమలు చేయాలని.. అలా కాకుండా ఎనిమిది కార్పొరేషన్ల నుంచి నిధులు మళ్లించడం ఏమేరకు సమంజసం అని ప్రశ్నించారు.

అలాగే అమ్మ ఒడికి పథకానికి ఆరు వేల మూడొందల కోట్లు ఈ కరప్షన్ నుంచి మళ్లించారని అన్నారు. రాబోవు రోజుల్లో ఈ ఎనిమిది కార్పొరేషన్లు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, కాపు, మైనార్టీ, క్రిస్టియన్, ఓబీసీ కార్పొరేషన్ డబ్బులు వేరే పథకాలకు మళ్లించవద్దని ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచించారు.

Tags:    

Similar News