Kadapa: ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రికి లేదు

నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

Update: 2020-03-16 11:57 GMT
Congress Leader Tulasi Reddy Press Meet

కడప: నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను తప్పులుబట్టడం సమంజసం కాదని,రాష్ట్రం లో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని పేర్కొన్నారు.ఎన్నికలకు ముఖ్యమంత్రి కి సంబంధం లేదని,అధికారం లోకి వచ్చి 9 నెలలు అయిందని అధికారులు అందరూ గతం నుంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల కమిషనర్ ను సామాజిక వర్గానికి పోల్చడం సరికాదని తెలిపారు.

ముఖ్యమంత్రి దిగజారుడు మాటలను మానుకోవాలని, ముఖ్యమంత్రి కులం ఏమిటో ఆయనకు తెలీదన్నారు. ముఖ్యమంత్రి హోదా కు జగన్మోహన్ రెడ్డి అనర్హుడన్నారు. కరోనా వల్ల ఎన్నికలను వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేస్తే ముఖ్యమంత్రికి ఎందుకు కోపం వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా కాదు రద్దు చేయాలని,అనేక చోట్ల వైసీపీ వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.


Tags:    

Similar News