కోరిక తీరిస్తేనే .. లేదంటే..

కోరిక తీరిస్తేనే .. లేదంటే.. కోరిక తీరిస్తేనే .. లేదంటే.. కోరిక తీరిస్తేనే .. లేదంటే..

Update: 2019-09-21 02:15 GMT

కాలేజీలో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న కామాంధుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరిక తీరిస్తేనే పాస్ చేయిస్తానంటూ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కళాశాల కరస్పాండెంట్‌.. ఈ ఘటన మచిలీపట్నంలోని సారా గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కాలేజీలో వెలుగుచూసింది. పశ్చిగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విద్యార్థిని ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరింది. రెండు సంవత్సరాల పాటు అన్ని సబ్జెక్టులు పాస్‌ అవుతూ వచ్చింది.

అయితే మూడో సంవత్సరం వచ్చాకా ఆమెపై కాలేజీ కరస్పాండెంట్‌ ఎస్‌.రమేష్ కన్ను పడింది. దీంతో ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. తన కోరిక తీరిస్తేనే మూడు, నాలుగో సంవత్సరాల్లో సబ్జెక్టులు పాస్‌ చేయిస్తానని, లేదంటే ఫెయిల్‌ చేయిస్తానంటూ బెదిరించాడు. దాంతో ఆ విద్యార్థిని దిగులు చెందింది. ఈ క్రమంలో అతడు అన్నట్టుగానే మూడో సంవత్సరం సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయించాడు. సప్లిమెంటరీలో పరీక్ష రాయగా మళ్లీ ఫెయిల్‌ అయ్యేలా చేశాడు. దాంతో బాధపడుతూ.. ఈ విషయాన్నీ తలిదండ్రులకు చెప్పింది. వారు జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితునిపై కేసు నమోదు చేయాలనీ ఆదేశించారు   

Tags:    

Similar News