ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి: సీఎం జగన్‌

Update: 2019-10-26 07:20 GMT

దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.. వెలుగుల పండుగ దీపావళి అని తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని అభిలషించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక.. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలి' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Tags:    

Similar News