వారికి మానవతా దృక్పథంతో సాయం చేయాలి : సీఎం జగన్

రోడ్లలపై నడుస్తూ వెళ్తున్న వలస కార్మికులకు ఆహారం, వసతి సదుపాయాల విషయంలో వారికి ఇలాంటి లోటు రానివ్వొద్దని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

Update: 2020-05-17 13:04 GMT
YS Jagan(File photo)

రోడ్లలపై నడుస్తూ వెళ్తున్న వలస కార్మికులకు ఆహారం, వసతి సదుపాయాల విషయంలో వారికి ఇలాంటి లోటు రానివ్వొద్దని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కార్మికులకు అందుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్‌ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై సీఎంకు అధికారులు వివరించారు.

మానవతా దృక్పథంతో వలస కూలీలకు సాయం చేయాలని అన్నారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దన్నారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదేనని సీఎం జగన్ సూచించారు. కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామని, వారిని తిరిగి బస్సుల్లో పంపించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇవాళ గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లా నుంచి 52 మంది వలస కూలీలను పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మందిని, కృష్ణా జిల్లా నుంచి 16 బస్సుల్లో 410, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని పంపించామన్నారు.

Tags:    

Similar News