30న సచివాలయ నియామక పత్రాలు.. అక్టోబర్ 2న ఆ జిల్లాలో..

30న సచివాలయ నియామక పత్రాలు.. అక్టోబర్ 2న ఆ జిల్లాలో.. 30న సచివాలయ నియామక పత్రాలు.. అక్టోబర్ 2న ఆ జిల్లాలో..

Update: 2019-09-28 02:24 GMT

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనవారందరికీ ఈ నెల 30న ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు. ఒకవేళ పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్‌ 30 నాటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తికాని వారికి వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందిచనున్నారు. అక్కడినుంచే ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు.

సీఎం ప్రసంగాన్ని వీక్షించడానికి పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా సీఎం కార్యక్రమం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుంది. ఇక జిల్లాల్లో జిల్లా మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడతారని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 2న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

Tags:    

Similar News