CM YS Jagan orders to take special action on corona control: కరోనా నియంత్రణకి ప్రత్యేక చర్యలకు సీఎం జగన్ ఆదేశాలు!

CM YS Jagan orders officials: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు.

Update: 2020-07-10 15:52 GMT
CM YS Jagan orders officials

CM YS Jagan orders officials: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో కరోనాని పూర్తిస్థాయిలో నియంత్రించడం, మెరుగైన సేవలను అందించే అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారని ఆన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ అధికారయంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇక క్వాంరంటైన్, కోవిడ్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ (డెవలప్‌మెంట్)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుందని ఆయన వెల్లడించారు.

సదుపాయాలపై థర్డ్‌పార్టీతో సర్వే :

కోవిడ్ ఆసుపత్రులపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం థర్డ్‌పార్టీతో సర్వే నిర్వహించిందని అయన తెలిపారు. అయితే ఈ సర్వేలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలిసిందని, దీనితో జిల్లా జాయింట్ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్) లకు ఈ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మరోసారి థర్డ్‌పార్టీతో రెండోవిడత సర్వే చేయించబోతున్నామని, అయినప్పటికీ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈనెల 15లోగా అన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపు:

కోవిడ్ సెంటర్‌లలో బిల్లలు పెండింగ్‌లో వున్న బిల్లుల విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వచ్చిందని, వాటిని జూన్ 30వ తేదీ వరకు వున్న బిల్లులను వెంటనే ఈ నెల పదిహేనో తేదీలోగా చెల్లించాని సీఎం ఆదేశించినట్లు కృష్ణబాబు తెలిపారు. ఇక సెంటర్లలో అందిస్తున్న ఆహారం కూడా నాణ్యతతో వుండాలని, ప్యాకింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.ఈ సెంటర్లలో రోజుకు ఒక వ్యక్తికి రూ.500 ఆహారం, ఇతర సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నామని, ఇంతపెద్ద మొత్తం ఇలా ఇవ్వడం రాష్ట్రంలోనే మొదటిసారి అని అన్నారు .

త్వరలో ప్రతిజిల్లాలోనూ 5వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్లు:

కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆసుపత్రుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ ఆసుప్రతికి కనీసం పదిహను నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తన్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 కోవిడ్ కోవిడ్ సెంటర్లలో మొత్తం 45240 బెడ్ లను సిద్దం చేయడం జరిగిందని కృష్ణబాబు తెలిపారు. ఇక మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్ లను త్వరలో 5వేల బెడ్ లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పదిశాతం పరీక్షలు:

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పదిశాతం మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అయన తెలిపారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్ట్‌లు, రోడ్డుమార్గంలో వచ్చే వారిని కూడా పరీక్షించిన తరవాతే అనుమతిస్తున్నామని అన్నారు. ప్రతిరోజూ 4600 మంది వరకు రాష్ట్రంలోకి వస్తున్నారని తెలిపారు.   

Tags:    

Similar News