Coronavirus Updates in AP: ఏపీలో మరో 1576 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Published on: 10 July 2020 2:00 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో మరో 1576 కరోనా పాజిటివ్‌ కేసులు
X
Coronavirus Updates in Telangana

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1576 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 21,020 శాంపిల్స్‌ని పరీక్షించగా 1576 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 981 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఒకరు, శ్రీకాకుళం లో ఒకరు, విశాఖపట్నం లో ఒకరు, విజయనగరం లో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 21,071. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 292. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 11,231కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,124 మంది చికిత్స పొందుతున్నారు.





S. Srikanth

S. Srikanth

Next Story