CM Jagan: కర్నూలు జిల్లా నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన
CM Jagan: జగనన్న చేదోడు నిధులు విడుదల చేయనున్న సీఎం
CM Jagan: కర్నూలు జిల్లా నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఏపీలో మరో పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకానున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలని వారికి చేదోడునిస్తూ వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 25వేల 20 మంది అర్హులైన వారికి 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.
ఈ జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా 10 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నారు. అయితే తాజా సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి 40వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఇవాళ అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం 1,252.52 కోట్ల రూపాయలు ప్రభుత్వం అంటోంది. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే ఎవరికీ మిస్ కాకుండా సాయం అందాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.