నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
Jagan: మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
Jagan: ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి వైజాగ్ చేరుకుంటారు. అనంతరం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో సిద్ధం పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారు వైసీపీ బాస్. ఈ సభలో సుమారు 3 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిద్ధం బహిరంగ సభను ప్లాన్ చేసింది వైసీపీ.