CM Jagan: రేపు దెందులూరులో సీఎం జగన్ పర్యటన

CM Jagan: వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ

Update: 2024-02-02 03:54 GMT

CM Jagan: రేపు దెందులూరులో సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ సిద్ధం పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ బహిరంగ సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే తీరుతో అక్కడి పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది.

అటు మైలవరం క్యాడర్‌ను తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు ఎంపీ కే‎శినేని నాని, నియోజకవర్గ పరిశీలకుడు పడమట సురేష్ బాబు. మరో వైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు ప్రచారంపై ఈ నెల 4 లేదా 5వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు ప్రకటిస్తానన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Tags:    

Similar News