Razole: సీఐ నరేష్ ‘పెద్ద మనసు’: గల్ఫ్ బాధితురాలికి విముక్తి.. రూ. 20 వేల ఆర్థిక సాయం!
Razole: మస్కట్‌లో చిక్కుకున్న గల్ఫ్ బాధితురాలు సంపూర్ణను రాజోలు సీఐ నరేష్ కుమార్ మంత్రి నారా లోకేష్ సహకారంతో స్వదేశానికి రప్పించారు.
Razole: సీఐ నరేష్ ‘పెద్ద మనసు’: గల్ఫ్ బాధితురాలికి విముక్తి.. రూ. 20 వేల ఆర్థిక సాయం!
రాజోలు (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ఇటీవల తరచు ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయం చేయడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తు... చాలా మంది ప్రయాణికులకు ఉచితంగా బ్రాండెడ్ హెల్మెట్స్ అందిస్తు తరచు వార్తల్లో నిలుస్తున్న రాజోలు సీఐ గల్ఫ్ బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తు,వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం కూడా అందించి తన ఉదారతను చాటుకున్నారు.
సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన యర్రసాని సంపూర్ణ జీవనోపాధి నిమిత్తం మస్కట్ దేశం వెళ్లానని, ఏజెంట్ మోసం వల్ల చాలా కష్టాలు అనుభవిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. తనకు జీతం ఇవ్వకుండా,సరైన తిండి కూడా పెట్టకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు రాజోలు సీఐ టి వి నరేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా... వెంటనే స్పందించిన సీఐ నరేష్..ఏపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి దృష్టికి ఈ విషయాన్ని చేరవేసి, ఆ బాధితురాలు క్షేమంగా ఇంటికి వచ్చి విధంగా ఏర్పాట్లు చేసారు. దీంతో సురక్షితంగా స్వగ్రామం చేరుకున్న సంపూర్ణ రాజోలు సీఐని కలిసి నారా లోకేష్ కు సీఐ నరేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే గల్ఫ్ వెళ్లి అనారోగ్యం పాలవడమే కాకుండా,ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంపూర్ణ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం చేసి తన ఉదారత ను సీఐ నరేష్ మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సేవలను పలువురు అభినందిస్తున్నారు.