CM Jagan: నేడు విశాఖలో సీఎం జగన్ టూర్
CM Jagan: పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్న సీఎం జగన్
CM Jagan: నేడు విశాఖలో సీఎం జగన్ టూర్
CM Jagan: సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశం అవుతారు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి అమర్నాథ్ పరిశీలించారు.