వేల కోట్ల ప్రాజెక్టులు కాదు... పర్యావరణ పరిరక్షణ ముఖ్యం : సీఎం జగన్‌

వేల కోట్ల ప్రాజెక్టులు కాదు... పర్యావరణ పరిరక్షణ ముఖ్యం : సీఎం జగన్‌

Update: 2019-09-27 04:21 GMT

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి అటవీశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణపై నెలలోగా ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని తేల్చిచెప్పిన సీఎం.. వేల కోట్ల ప్రాజెక్టులు కాదు... పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని స్పష్టీకరించారు.

పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే, భవిష్యత్‌ తరాలు ప్రశ్నార్థకం అవుతాయని ఈ సందర్బంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీల కోసం ఫార్మా సిటీలను ఏర్పాటు చేశామని, అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇవ్వాలన్నారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్, మురుగు నీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడిచి పెట్టాలని సూచించారు.

Tags:    

Similar News