అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
Jagan Review Meeting: విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
Jagan Review Meeting: విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సీఎం సమగ్రంగా చర్చించారు. విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు కోసం 268 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుందని...ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ వస్తుందని అధికారులు వివరించారు.
విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించనున్నారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలించామని దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. కార్ పార్కింగ్, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించడంతో పాటు అంబేద్కర్ స్మృతి వనానికి దారితీసే రోడ్లను సుందరీకరిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అత్యంత నాణ్యతతో అందంగా నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు.