రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ కనెక్ట్ టు ఆంధ్రా ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మీ రాష్ట్రం మీ గ్రామంపై ప్రేమాభిమానులు చూపించడానికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.